టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. దీనిపై ఇప్పుడు అధికార పార్టీ లక్ష్యంగా టీడీపీ విమర్శలు చేస్తుంది. తాజాగా నారా లోకేష్ మండిపడ్డారు. “సిఎం జగన్ గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారు. ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరం.
జేసి ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం. తక్షణమే ఆసుపత్రికి తరలించి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను” అని ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసారు. నిన్న సాయంత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
.@ysjagan గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారు. ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరం.(1/2) pic.twitter.com/tnq3GIrER5
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 19, 2020