చిరు వీడియో.. బాలు గళం మళ్లీ విప్పాలి..!

-

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్య‌ణ్యం కరోనా మహమ్మారితో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రెగ్యులర్‌ ట్రీట్‌మెంట్‌కి కరోనా నయం కాకపోవడంతో చివరి ప్రయత్నంగా ప్లాస్మా ద్వారా వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా.. ఆయన ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో సందేశం ఇచ్చారు. కరోనా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.

ఎస్పీబీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఈ వీడియోలో చిరంజీవి భావోద్వేగానికి గురైయ్యారు. బాలు త్వరగా కోలుకుని ఆ గళం మళ్లీ విప్పాలని, కోటి రాగాలు తీయాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం కోసం కోట్లాది మంది అభిమానులతో పాటు తాను కూడా భగవంతుడిని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news