సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఎలాంటి ఓటింగ్ లేకుండానే సభలో బిల్లు పాస్ అయింది. అలాగే మరొకటి , సీఆర్డీఏ బిల్లును కూడా జగన్ సర్కార్ సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సభకు సీఎం జగన్‌తో పాటు… ఏపీ మంత్రులంతా హాజరయ్యారు. వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్, సీఆర్డీఏ బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశ పెట్టారు.
అయితే ఈ సంద్భంగా సభలో జగన్ నిద్రపోతున్న ఫోటోను నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఓ వైపు రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే.. మరోవైపు రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే..ఈ మనిషికి ఇలా ఎలా నిద్ర పడుతోంది? అని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జగన్ నిద్రపోతున్న ఫోటోను కూడా దాంతో పాటు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు లోకేష్.
ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి
అసెంబ్లీని ముట్టడిస్తుంటే… మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే… ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?#SaveAmaravati#MyCapitalAmaravati#APWithAmaravati pic.twitter.com/bMGVJ2sufI— Lokesh Nara (@naralokesh) January 20, 2020