బీచ్‌లో మోడీ చెత్త సేక‌ర‌ణ‌పై భారీ విమ‌ర్శ‌లు..

-

చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ఇండియా ప‌ర్య‌ట‌నలో ప్ర‌ధాని మోడీ ఆయ‌న‌కు గైడ్‌గా వ్య‌వ‌హ‌రించారు. శుక్ర‌వారం నాడు ఇద్ద‌రు నేత‌లు దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. శ‌నివారం ఉద‌యం మామల్లాపురం బీచ్‌లో ప్ర‌ధాని మోడీ స్వ‌చ్ఛ భార‌త్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా తానే స్వ‌యంగా చెత్త‌ను సేక‌రించి స్వ‌చ్ఛా భార‌త్ సందేశం ఇచ్చారు. సముద్రతీరానికి వెళ్లిన మోదీ దాదాపు అరగంట పాటు మోదీ బీచ్‌ను శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘మామల్లాపురం బీచ్‌కు జాగింగ్‌ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. సేకరించిన చెత్తను తాను బసచేసిన హోట‌ల్‌లోని సిబ్బంది జయరాజ్‌కు అప్పగించాను.. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అంటూ మోదీ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ చెత్త సేక‌ర‌ణ వీడియో మీద సోష‌ల్ మీడియాలో బారీ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మోడీ సేక‌రించిన తీరుపై నెటిజ‌న్లు విరుచుకు ప‌డుతున్నారు. నిజానికి ప్లాస్టిక్‌ను నిషేధించాల‌ని ప్ర‌భుత్వమే చెప్తున్న‌ది. కానీ బీచ్‌లో మోడీ ప్లాస్టిక్ క‌వ‌ర్‌నే ఉప‌యోగించి చెత్త‌ను సేక‌రించారు. బీచ్‌లోని చెత్త‌ను అంతా ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో వేసి హోట‌ల్ సిబ్బందికి ఇచ్చారు. ఇలా ప్లాస్టిక్ వాడుతూ స్వ‌చ్ఛా భార‌త్ సందేశాలు ఇవ్వ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో వైపు శుభ్రంచేసిన ప్ర‌దేశం ప‌బ్లిక్ ప్లేస్‌కాద‌నీ తాజ్ హోటల్స్ & రిసార్ట్ సంబందించిన ప్రైవేట్ అండ్ క్లీన్ బీచ్ అనే స‌మాచారం కూడా వైర‌ల్ అవుతున్న‌ది.

అయితే రెండు నెల‌ల క్రితం డిస్క‌వ‌రీ చానెల్‌లో బేర్ గ్రిల్స్‌తో మోడీ సాహ‌స యాత్ర అని చేసిన‌ప్పుడు అది ప్ర‌త్యేక వీడియో షూట్ అంటూ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news