అఫీషియ‌ల్‌: ‘ అల వైకుంఠ‌పురం ‘ రిలీజ్ డేట్‌

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు రెండు హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాతో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడ‌తార‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు సొంత బ్యాన‌ర్ లాంటిది అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇప్ప‌టికే అల వైకుంఠపురంలో సినిమాలోని మొదటిపాట ‘సామజవరగమన’ విడుదలై సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక అంత‌కు ముందే వ‌చ్చిన ఈ సినిమా స్టిల్స్‌, టీజ‌ర్‌, పోస్ట‌ర్ల‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

ala vaikuntapuramlo
ala vaikuntapuramlo

ఇక ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటోంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ రోజు రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ సినిమాని సంక్రాంత్రి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా ఆయన విడుదల చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో బ‌న్నీ లుక్ అదిరిపోయింది. ఓ చేతిలో కోడిపుంజుతో పాటు మ‌రో చేతిలో కొడ‌వ‌లి ప‌ట్టుకుని అచ్చ‌మైన ప‌ల్లెటూరి బాయ్‌లా ఇర‌గ‌దీస్తున్నాడు. ఓవ‌రాల్‌గా బ‌న్నీ లుక్ చూస్తుంటే అదిరిపోయే సంక్రాంతి అల్లుడిలా ఉన్నాడు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో సుశాంత్, టబూ, నివేథా పేతురాజ్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సునీల్, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news