ఆ సరస్సులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని ఛేదించటం మావల్ల కాదని నాసా శాస్త్రవేత్తలు కూడా చేతులెత్తేశారు. ఆ సరస్సు పేరే లూనార్ సరస్సు. ఇది మహారాష్ట్రలోని బుల్ధన జిల్లాలో ఉంది. ఈ సరస్సు పెద్ద క్వశ్చన్‌గా మారింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీనిని తేల్చే పనిలో పడ్డారు. ఇప్పటికీ ఈ సరస్సు రహస్యం మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రకృతి పరంగా లూనార్ సరస్సు ఏర్పడింది. ముందుగా ఈ సరస్సును ఎవరూ గుర్తించలేదు. కొంత కాలం తర్వాత గుర్తించబడినప్పటికీ.. ఆ సరస్సు విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
గుండ్రంగా.. కొండ మధ్య ఏర్పడినట్లుగా ఉండే ఈ సరస్సు ఎలా ఏర్పడిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉల్కాపాతం భూమిపై పడటం వల్ల ఈ సరస్సు ఏర్పడిందని పలువురు పరిశోధకులు అంటున్నారు. కానీ అలా ఏర్పడితే ఉల్కాపాతం ఆనవాళ్లు ఉండాలి కదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. లూనార్ సరస్సు భూమి ఉపరితలానికి సరాసరి అర కిలోమీటర్ కంటే ఎక్కువ లోతులో ఏర్పడింది. ఈ విషయమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 70 సంవత్సరాల క్రితం కొందరు శాస్త్రవేత్తలు ఈ సరస్సు ఎలా ఏర్పడిందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉల్క వల్ల ఏర్పడిందని అభిప్రాయ పడ్డారు కానీ సరైన ఆధారాలు లేకపోవటంతో వారి అభిప్రాయాన్ని ఎవరూ నమ్మలేదు.
ఇదిలా ఉంటే మరోపక్క అగ్నిపర్వతం పేలడం ద్వారా ఏర్పడిందని కొందరు భావిస్తున్నారు. అదేంకాదు లూనార్ సరస్సు వేదకాలం నాడే ఏర్పడిందని ఇంకొందరు చెబుతున్నారు. ఆ సరస్సు ఏర్పడటానికి శ్రీమహా విష్ణువే కారణం అని చెబుతున్నారు. ఈ సరస్సు పూర్తిగా రసాయన లక్షణాలతో నిండి ఉందని సైంటిస్టులు తేల్చి చెప్పేశారు. ఇది 2006 సంవత్సరంలో పూర్తిగా ఎండిపోయిందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఆ సమయంలో సరస్సులో చిన్న చిన్న ఖనిజ ముక్కలు మెరుస్తూ కనిపించాయని వారు చెప్పారు. వీరు చెప్పిన మాటలే సరస్సు ఉద్భవాన్ని తేల్చేందుకు సాధనంగా మారాయి. కానీ వర్షాలు రావటంతో సరస్సు మళ్లీ నిండిపోయింది. లూనార్ పుట్టుక తెలుసుకునేందుకు శాస్ర్రవేత్తలు కృషి చేస్తున్నా ఫలితం దక్కటం లేదు.