కళ్ళ కింద నల్లటి వలయాలు పోవడానికి పాటించాల్సిన డైట్..

-

మనం ఏది తింటామో అది మన ఆరోగ్యంలో కనిపిస్తుందని ప్రతీ ఒక్కరికీ తెలుసు. మనం తీసుకునే ఆహారాలే మనల్ని ఎటు తీసుకువెళ్ళాలో చూపిస్తాయి. చర్మ సౌందర్యానికి ఆహారం పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా ముఖం అందంగా కనిపించడానికి ఇది చాలా అవసరం. ప్రస్తుతం జీవన విధానాల్లో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు మొదలైనవన్నీ చర్మానికి నష్టం కలిగిస్తున్నాయి. ముఖంపై అతి సున్నితమైన భాగమైన కళ్ళ కింద వలయాలు ఏర్పడడానికి కారణం అదే.

ఇవి ఆహ్వానించకుండానే వచ్చి తొందరగా పోకుండా ఉంటాయి. చూడడానికి వికారంగా కనిపించే ఈ నల్లటి వలయాలని పోగొట్టుకోవడానికి డైట్ నియమాలు పాటిస్తే బాగుంటుంది.

మనం తీసుకునే ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉంటే కళ్ళకింద వలయాలు తగ్గిపోతాయి. పుచ్చకాయ, దోసకాయ వంటి నీరు ఎక్కువగా ఉన్న ఆహారాలని తీసుకుంటే నల్లటి వలయాలు ఏర్పడకుండా ఉంటాయి.

జంక్ ఫుడ్ తినడం మానేయాలి. అలాగే తీపి పదార్థాలు ఎక్కువ తినకూడదు. కాఫీగా దూరంగా ఉండాలి. వాటి స్థానంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా తినాలి.

ఎక్కువ ఉప్పు ఉన్న పదార్థాలని ఆహారంగా తీసుకోవద్దు. అలాగే ఆల్కహాల్ ని పక్కకి పెట్టాలి. ఎక్కువ కాలం నిల్వ చేసిన పచ్చళ్ళని తిన్నా కళ్ళకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.

రోజుకి 8 నుండి 10గ్లాసుల నీళ్ళు తాగాలి. దానివల్ల శరీరం డీ హైడ్రేషన్ కి గురి కాకుండా ఉండి చర్మం పాడవకుండా ఉంటుంది. దోసకాయలని కళ్ళ మీద పెట్టుకున్నా నల్లటి వలయాలు తగ్గే అవకాశం ఉంది. కానీ అది తాత్కాలికం మాత్రమే. శాశ్వతంగా అవి దూరం కావాలంటే మాత్రం పైన చెప్పిన డైట్ పాటించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news