అంతరిక్ష రంగంలో కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. గత మూడు దశాబ్ధాలుగా సైంటిస్టుల కళ సాకారం కాబోతోంది. ప్రపంచంలో అత్యంత పెద్ద, శక్తివంతమైన టెలిస్కోప్ ’’జెమ్స్ వెబ్‘‘ నేడు అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల ఖర్చుతో నాసా, కెనెడియన్ స్పెస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పెస్ ఎజెన్సీలు సంయుక్తంగా ఈ జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నిర్మించారు. ఫ్రెంచ్ గయానా నుండి యూరోపియన్ ఏరియాన్ రాకెట్ ద్వారా జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు.
మొదట 1989లో వర్క్‌షాప్‌లో హబుల్‌కు సహాయంగా మరో టెలిస్కోప్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 2004 లో జెమ్స్ వెబ్ టెలిస్కోప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి, 14 దేశాల నుండి వేలాది మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మరియు ఇంజనీర్లు 40 మిలియన్ గంటలు దీని నిర్మాణం కోెసం వెచ్చించారు. విశ్వం పుట్టుకకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవడానికి జెమ్స్ వెబ్ ఉపయోగపడనుంది. గతంలో హబుల్ టెలిస్కోప్ తీసిన ’ హబుల్ డీప్ ఫీల్డ్‘ ఫోటో ద్వారా విశ్వం తొలినాళ్లలో ఏర్పడే విషయాలు బయటకు వచ్చాయి. విశ్వంలో చిన్న పాయింట్ వద్ద హబుల్ టెలిస్కోప్ ను కేంద్రీకరించడంతో ఆ ప్రాంతంలోని వేలకొద్ది గెలాక్సీలను గుర్తించింది. అయితే జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో గెలాక్సీలను గుర్తించే అవకాశం ఉంది.