మరోసారి తీన్మార్ మల్లన్న పై కేసు నమోదైంది. తాజాగా కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై ట్విట్ పై కేసు నమోదు చేశారు. దీనిపై టీఆర్ఎస్ ఐటీ సెల్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ కుమారుడు హిమన్షుపై తీన్మార్ మల్లన్న అసభ్య ట్విట్ పెట్టడంతో వివాదం మొదలైంది. బాడీ షేమింగ్ చేస్తూ ట్విట్ చేశాడని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ట్విట్ పై కేటీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను ఇందులోకి లాగడంతో ఎమోషనల్ అయ్యారు కేటీఆర్.
ఈ విషయంపై కేటీఆర్ కు పలువురి నుంచి మద్దతు లభిస్తోంది. వైెఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిళ, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు కేటీఆర్ కు అండగా నిలిచారు. కుటుంబ సభ్యులు, పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మంచి పద్దతి కాదంటూ ట్విట్లు చేశారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. తీన్మార్ మల్లన్నకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి జరిగితే ఉరికిచ్చి .. బట్టలూడ దీసి కొడుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.