మంత్రి కేటీఆర్ కు రాజా సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. తరుమి తరిమి కొడుతాం !

-

మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 9 ఓ కార్యక్రమం కోసం మునవర్ ను కేటీఆర్ ఆహ్వానించారు. అయితే తెలంగాణా కు మునవర్ ఫరూక్  రాకను హిందు సంఘాలు, రాజాసింగ్.. తీవ్రంగా వ్యతిరేకించారు. మునవర్ పై 16 రాష్ట్రలలో నిషేధం ఉంది.. 16 రాష్ట్రల ముఖ్యమంత్రులు ఆయనపై నిషేధం పెట్టారని రాజా సింగ్ ఫైర్ అయ్యారు.

అలాంటి వ్యక్తిని తెలంగాణ కు తీసుక రావాలని కేటీఆర్ ప్రయత్నం  చేస్తున్నారని.. హిందూ దేవతవాలను తిట్టే వ్యక్తి మునవర్ అని అగ్రహించారు. మీరు సెక్యులర్ కావచ్చు.. కానీ కేసీఆర్ దేవాలయలు నిర్మిస్తారు, పూజలు చేస్తారన్నారు. కేసీఆర్ మొఖం చూసి ఐన మునవర్  రాష్ట్రనికి పిలవకండని హెచ్చరించారు. కాదు అని పిలిస్తే..   మునవర్ ను తెలంగాణ నుండి తరుమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్ లో తరిమి కొడుతే ముంబైలో దాగి ఉన్నాడని.. అలాంటిది తెలంగాణ కు మునవర్ ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news