గోవాలో మొదటి ఆల్కహాల్ మ్యూజియం… భలే ఉందిలే..!

-

మ్యూజియంలో మనం పురాతనమైన వస్తువులు, సైన్స్ కు సంబంధించిన మూలాలు చూసి ఉంటాం. కానీ మొదటిసారిగా అలాగే ఆల్కహాల్ చరిత్రను చెప్పడానికి ఒక మ్యూజియం నిర్మించారు. మందు తాగటమే కాదు..అసలు ఆ మందు పుట్టుపూర్వోత్తరాలు ఏంటో కూడా తెలుకోండి మరి..!

మద్యం తయారీ చరిత్రను తెలిపేందుకు తాజాగా గోవాలో ‘ఆల్కహాల్ మ్యూజియం’ లాంచ్ చేశారు. మూమూలుగానే గోవా అంటే గుర్తుకొచ్చేది మొదట బీచ్, ఆ తరువాత బీర్..నైట్ టైంలో బీచ్ లో బీరు తాగితే వచ్చే కిక్కేవేరబ్బా..అలాంటి దేశంలో ఇలాంటి మ్యూజియం ఇది ఒక్కటే కావడం విశేషం.

మద్యం చరిత్రను చెప్పటానికే కాని..మద్యం వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో కాదు ఈ మ్యూజియం నిర్మించింది అంటున్నారు మ్యూజియం వ్యవస్థాపకులు నందన్ కుడ్చడ్కర్ .ప్రపంచ చరిత్రలోనే మద్యం కాచే చరిత్రకు అంకితమిచ్చిన మొట్టమొదటి మ్యూజియంగా ఆయన పేర్కొన్నారు.

ఎక్కడ నిర్మించారు

ఈ ఆల్కహాల్ మ్యూజియాన్ని 1,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్తర గోవా బీచ్ లో నిర్మించారు. ఇది సిన్క్వెరిమ్, కాండోలిమ్ టూరిజం హబ్‌ను కనెక్ట్ చేసే ఓ బిజీ లేన్‌లో ఉంటుంది. అలాగే పనాజీకి దాదాపు 10 కిమీ దూరంలో ఉంది ‘ఆల్ ఎబౌట్ ఆల్కహాల్’ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన మద్యం ఫెని తయారీ విధానం గురించి తెలియజేస్తుంది.

ఏం ఏం ఉన్నాయంటే..

ఈ మ్యూజియంలో 1950 కాలం నాటి ఫెని అంటే పులియబెట్టిన జీడిపప్పు లేదా కొబ్బరి నీళ్ల నుంచి తయారు చేసిన ఆల్కహాలిక్ డ్రింక్ బాటిళ్లు, ఫెని డ్రింక్ సర్వింగ్ గ్లాస్‌లు, పాత చెక్క డిస్పెన్సర్‌లు, కొలిచే పరికరాలు ఉన్నాయి. గోవాలో జీడిపప్పుతో మద్యం తయారు చేసే కలను ప్రోత్సహించే లక్ష్యంతోనే వీటిని ప్రదర్శించారు. 16వ శతాబ్దానికి చెందిన ఫెని సర్వింగ్ పరికరాలు, ఒక పురాతన చెక్క షాట్ డిస్పెన్సర్, మ్యూజియం లోపల నాలుగు గదులలో వివిధ పాత మట్టి కుండలు,ఫెని గాఢతను కొలవడానికి ఉపయోగించే ‘గర్వ్’ (స్కేల్), రష్యా నుంచి సేకరించిన క్రిస్టల్ ఆస్ట్రేలియన్ బీర్ గ్లాస్ ప్రదర్శనకు పెట్టారు. ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన గ్లాస్‌వేర్, చాలీస్ , స్నిఫ్టర్స్ , వంపు తిరిగిన వైన్ గ్లాసెస్, ప్రపంచంలోనే ఎత్తైన పోలాండ్ షాట్ గ్లాస్ ఇతర వస్తువులను కూడా చూడొచ్చు.

మ్యూజియంలోని నాలుగు గదులలో ఒకటి పాత స్టవ్‌లు, స్పూన్లు, మోర్టార్, పెస్టిల్స్, గ్రైండర్‌లు సహా గోవా సంస్కృతికి సంబంధించిన ఇతర వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. కుడ్చడ్కర్ తన తండ్రితో కలిసి తిరుగుతున్న సమయంలో పురాతన వస్తువులను సేకరించే అభిరుచిని పెంచుకున్నారు. ఆ అభిరుచి నుంచి వచ్చిన రూపమే ఈ మ్యూజియం.

Read more RELATED
Recommended to you

Latest news