గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..!

పసిడి ప్రియులకి గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈరోజు పసిడి రేటు స్వల్పంగానే క్షీణించింది. తగ్గడం ఇది వరుసగా మూడో రోజు. ఇది ఇలా ఉంటే వెండి ధర కూడా తగ్గింది. వెండి రేటు ఎక్కువగానే దిగొచ్చింది.

 

 

ఇక రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే… హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 మాత్రమే క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ.49,630కు దిగొచ్చింది బంగారం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ.45,500 వద్దనే ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 0.02 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1857 డాలర్లకు క్షీణించింది.

ఇక వెండి రేట్లు గురించి చూస్తే.. వెండి రేటు ఈరోజు భారీగానే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. రూ.600 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.75,900కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి రేటు మాత్రం పెరిగింది. ఔన్స్‌కు 0.30 శాతం పెరుగుదలతో 27.77 డాలర్లకు చేరింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ మొదలైన వాటి ప్రభావం బంగారం పై పడుతుందన్న సంగతి తెలిసిందే.