వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం

-

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వ్యాక్సినేషన్ కోసం ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. 18 ఏళ్ల దాటిన వ్యక్తులు నేరుగా వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా ఇప్పటివరకూ టీకా తీసుకోవాలంటే ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో టీకా తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియపై గ్రామీణ ప్రాంతవాసులు ఆసక్తి చూపలేదు. నిరక్షరాసులు, పేదలు చాలా ఇబ్బందులు పడేవారు.

దీంతో కేంద్రం తాజాగా వారికి వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్‌లో నమోదు లేకుండా ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి వ్యాక్సి తీసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా 25 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇంకా 20 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు. వీరికి కూడా వ్యాక్సిన్ ఇస్తామి కేంద్రం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news