గత ఐదేళ్లలో 19వేల మంది విద్యార్థులు డ్రాపౌట్.. కారణమేంటంటే..?

-

గత ఐదేళ్లలో దాదాపు 19వేల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. ప్రఖ్యాత విద్యాసంస్థలు, ఐటీటీ, ఐఐఎం, కేంద్ర విశ్వ విద్యాలయాల్లోనే విద్యార్థుల డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డ్రాపౌట్ స్టూడెంట్స్ అంతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే కావటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ విద్యాలయాల్లో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కుల వివక్ష, విపరీతమైన ఒత్తిడి, కఠినమైన సిలబస్‌ తదితర కారణాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు ఈ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయినా ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏం చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా కాలేజీ యాజమాన్యాలు చర్యలు తీసుకోవటం లేదు.

దీంతో సెంట్రల్‌ వర్సిటీల్లో 2018-2023 మధ్య 6,901 మంది ఓబీసీ, 3,596 మంది ఎస్సీ, 3,939 మంది ఎస్టీ విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. ఐఐటీల్లో 2,544 మంది ఓబీసీ, 1,362 మంది ఎస్సీ, 538 మంది ఎస్టీ విద్యార్థులు కాలేజీ క్యాంపస్‌లను వీడారు. 133 మంది ఓబీసీ, 143 మంది ఎస్సీ, 90 మంది ఎస్టీ విద్యార్థులు ఐఐఎంల నుంచి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news