అమ్మాయిలను మొబైల్ ఫోన్లు వాడనిస్తలేరు !

-

  • 42 శాతం మంది గంటకన్నా తక్కువే వాడుతున్నారు !
  •  త‌ల్లిదండ్రుల ఆంక్ష‌లు అధికంః తాజా స‌ర్వే

న్యూఢిల్లీ: నేటి స‌మాజంలో వచ్చిన మార్పుల నేప‌థ్యంలో టెక్నాల‌జీ అందిపుచ్చుకోవ‌డం అతి ముఖ్య‌మైన విష‌యం. దీనిలో భాగంగానే మొబైల్ ఫోన్ల వాడ‌కం ఏ స్థాయికి చేరుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే, మొబైల్ ఫోన్ల వినియోగంలో అబ్బాయిల‌తో పోలిస్తే.. అమ్మాయిల‌పై తీవ్రమైన ఆంక్ష‌లు ఉన్నాయ‌నీ, దీని కార‌ణంగా వీరు ఫోన్ల‌ను త‌క్కువ‌గా వాడుతున్నార‌ని తాజాగా ఓ స‌ర్వే లో వెల్ల‌డైంది. మ‌రీ ముఖ్యంగా ఫోన్లు వాడే విష‌యంలో అమ్మాయిపై త‌ల్లిదండ్రుల అధికంగా ఆంక్ష‌లు విధిస్తున్నార‌ని సర్వే పేర్కొంది. దేశంలోని బాలికలు, యువతుల్లో 42% మందికి తమ తల్లిదండ్రుల ఆంక్షల కారణంగా రోజులో గంట కన్నా ఎక్కువ సేపు మొబైల్‌ ఫోన్‌ అందుబాటులో ఉండటం లేదని సర్వే పేర్కొన్నది.

ఈ స‌ర్వేను ఢిల్లీకి చెందిన ఎన్జీవో సెంటర్‌ ఫర్‌ క్యాటలైజింగ్‌ చేంజ్‌ (సీ3), డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ (డీఈఎఫ్‌) సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఇందులో భాగంగా దేశంలోని ప‌ది రాష్ట్రాల్లో స‌ర్వే నిర్వ‌హించారు. దీనిలో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని 29 జిల్లాల‌కు పైగా దాదాపు 4,100 మందిపై సర్వే చేసి ఈ అధ్య‌య‌నం గ‌ణాంకాల‌ను వెల్లడించారు. దీని ప్ర‌కారం.. హర్యానాలో మొబైల్‌ వాడకంలో బాలికలు, బాలల మధ్య అంతరం అధికంగా ఉంది. ఇక కర్ణాటకలో ఎక్కువమంది బాలికలు (65 శాతం) మొబైల్‌ వాడుతున్నారు. ఈ విష‌యంలో తెలంగాణ బెట‌ర్ స్థాయిలోనే ఉంది. తెలంగాణ‌లో ఈ అంత‌రం 12 శాతంగా ఉంది. మొత్తంగా అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడ‌టం మంచిది కాద‌నే అభిప్రాయాన్ని తల్లిదండ్రులు వెలిబుచ్చార‌ని ఈ స‌ర్వే పేర్కొంది. కాగా, నేడు దేశ‌వ్యాప్తంగా బాలికా దినోత్సవం వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగానే వారు ఈ సర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news