క‌రోనా ఎఫెక్ట్‌: ఆస్ప‌త్రి బిల్డింగ్‌పై నుంచి దూకి బాధితుడి ఆత్మ‌హ‌త్య‌

-

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. పాజిటివ్‌కేసుల సంఖ్య‌తోపాటు మ‌ర‌ణించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అంతేగాకుండా.. ఈ మ‌హ‌మ్మారి భ‌యంతో ప‌లువురు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డుతున్నారు. వైర‌స్ సోకి కొంద‌రు, వైర‌స్ సోకుతుందేమోన‌న్న అనుమానంతో మ‌రికొంద‌రు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా.. బిహార్‌లో ఓ క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. జెహానాబాద్ జిల్లాలో ఆస్ప‌త్రి భ‌వ‌నం నుంచి దూకి ప్రాణాలు విడిచాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

coronavirus

అలాగే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన వ్యక్తికి ఇటీవల పాజిటివ్‌గా నిర్ధారించారు. బాధితుడు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తిరిగి స్వగ్రామానికి బ‌య‌లుదేరాడు. అయితే.. తనవల్ల కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకుతుందనే భయంతో బాపట్ల మండలం జమ్ముపాలెం శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా విషాదం నింపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version