కరోనా మహమ్మారికి 5 లక్షలమంది బలి.. ఎక్క‌డంటే..?

-

క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచాన్ని గ‌జ‌గ‌జ‌ వ‌ణికిస్తూనే ఉన్న‌ది. అమెరికా బ్రెజిల్ త‌రువాత అత్య‌ధిక మ‌ర‌ణాలు భార‌త‌దేదేశంలో సంభ‌వించాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 5ల‌క్ష‌ల మంది వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా మృతి చెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. గ‌త ఏడాది జులై 01 వ‌ర‌కు మ‌న‌దేశంలో మ‌ర‌ణాలు నాలుగు ల‌క్ష‌లు న‌మోదు అయ్యాయి. 217 రోజుల్లో మ‌రొక ల‌క్ష మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశంలో మ‌ర‌ణాలు 5,00,055 కు చేరుకున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 1,072 మంది మ‌ర‌ణించారు. దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 1,42,859 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌రువాత స్థానంలో వ‌రుస‌గా కేర‌ళ 56,701 ఉండ‌గా.. త‌మిళ‌నాడు 37,666, ఢిల్లీ 25,932, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 23,277 ఉన్నాయి. పాజిటివిటీ రేటు 9.27 శాతం వ‌ర‌కు చేరుకుంది. దేశ‌వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4.19 కోట్ల‌కు చేరుకోగా.. వాటిలో యాక్టివ్ కేసులు 14, 35, 569 కి చేరుకుంది. దేశంలో క‌రోనా కేసులు ఒక రోజు పెర‌గ‌డం మ‌రొక రోజు త‌గ్గ‌డం వంటివి చోటు చేసుకోవ‌డంతో అస‌లు క‌రోనా పెరుగుతుందా త‌గ్గుతుందా అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version