నేడు భారత వైమానిక దళంలోకి రాఫెల్ ఎంట్రీ..!

జూలై 29న 5 రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా వైమానిక ద‌ళ విమానాశ్ర‌యానికి చేరిన విష‌యం తెలిసిందే. అయితే వాటిని నేడు భారత వైమానిక దళంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారు. అంబాలాలోని ఏయిర్‌బేస్‌లో 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదౌరియా, రక్షణ శాఖ కార్యదర్శి డా అజయ్ కుమార్, డీఆర్డీడీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి కూడా పాల్గొన్ననున్నారు.

rafel

మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌ తో భార‌త్ 59 వేల కోట్ల డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతలో ఐదు విమానాలు భారత్ చేరుకున్నాయి. ఇందులో మూడు సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు, రెండు ట్విస్ సీటర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ రాఫెల్ విమానాలు విరామం లేకుండా 3700 కిలోమీటర్లు ప్రయాణించగలవు. గంటలకు 1389 వేగంతో దూసుకెళ్తాయి. ఇకపోతే రాఫెల్ విమానాన్ని నడపడానికి భారత వాయుసేనకు చెందిన కొంత మంది పైలట్లు ఇప్పటికే ప్రత్యేక శిక్షణను అందుకున్నారు.