67 పోర్న్ వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా

-

అంతర్జాలంలో పోర్న్ వెబ్‌సైట్‌లపై కేంద్ర సర్కార్ మరోసారి కొరడా ఝళిపించింది. 67 అశ్లీల వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ వెబ్‌సైట్‌లు బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ పొవైడర్లను ఆదేశించింది.

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతోపాటు పుణె ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు 63 వెబ్‌సైట్లను, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది.

ఇటీవలే అసత్య వార్తలు, మార్ఫింగ్‌ వీడియోలు, విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్‌ ఛానెళ్లపై కూడా కేంద్రం కొరడా ఝుళిపించింది. ఇప్పటికే 10 యూట్యూబ్‌ ఛానెల్స్‌కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్‌ చేసింది. అగ్నిపథ్‌, ఆర్మీ, కశ్మీర్‌ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news