అదానీ చేతికి ఏపీ, గుజరాత్‌ టోల్‌ రహదారులు..

-

దిల్లీ: మాక్వరీ ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌కు చెందిన ఏపీ, గుజరాత్‌ టోల్‌ రోడ్డు విభాగాన్ని అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంది. రూ.3,110 కోట్లకు దీన్ని కొనుగోలు చేసింది. గుజరాత్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ (జీఆర్ఐసీఎల్), స్వర్ణ టోల్‌ వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ను (ఎస్టీపీఎల్) కొనుగోలు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ( ఏటీఆర్ఎల్) ప్రకటించింది.

జీఆర్ఐసీఎల్ లో మాక్వరీకి 56.8 శాతం వాటా ఉండగా.. స్వర్ణ టోల్‌వేలో ఈ సంస్థకు 100 శాతం వాటా ఉంది. ఈ రెండింటినీ కొనుగోలు చేసినట్లు అదానీ రోడ్డు ట్రాన్స్‌ పోర్ట్‌ లిమిటెడ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ కొనుగోలు రెగ్యులేటరీ తెలపాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. 2022 సెప్టెంబర్‌ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని భావిస్తోంది.

16వ నంబర్‌ జాతీయ రహదారిపై 110 కిలోమీటర్ల పొడవునా తడ నుంచి నెల్లూరు వరకు స్వర్ణ టోల్‌వే కంపెనీ టోల్‌ రోడ్లను కలిగి ఉంది. ఎన్‌హెచ్‌-65పై నందిగామ- ఇబ్రహీంపట్నం- విజయవాడ మార్గంలో మరో 48 కిలోమీటర్ల పొడవునా టోల్‌ రోడ్లు ఉన్నాయి. చెన్నై, కృష్ణపట్నం వంటి కీలక పోర్టులను ఈ రోడ్లు కలుపుతున్నాయి. గుజరాత్‌లో జీఆర్ఐసీఎల్ కు రెండు కీలకమైన టోల్‌ రహదారులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version