బ్రేకింగ్: మారిటోరియంపై విచారణ వాయిదా

-

కరోనా మహమ్మారి సమయంలో మారటోరియం పథకం కింద బ్యాంకులు వాయిదా వేసిన ఈఎంఐ చెల్లింపులపై ‘జరిమానా’ వడ్డీని వసూలు చేయడంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 28 వరకు వాయిదా వేసింది. రుణాలు తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల వరకు పొడిగించవచ్చని ఈ నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ సుప్రీం కోర్టుకు చెప్పిన సంగతి తెలిసిందే.

ఆర్‌బిఐ, ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందు వాదనలు వినిపించారు. మారిటోరియం విషయంలో బ్యాంకు లు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రం మారిటోరియం విషయంలో దాదాపుగా ఇప్పటికే బ్యాంకు లకు సమాచారం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news