అఫ్గానిస్థాన్లో భూకంపం.. ఉత్తర భారత్‌లో ప్రకంపనలు

-

అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది. 6.1 తీవ్రతతో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో వణికారు. గురువారం మధ్యాహ్నం 2గంటల 50 నిమిషాలకు అఫ్గాన్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం కాబుల్కు 241 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది.  ఈ భూకంపం ప్రభావం ఉత్తరాదిలోని పలు ప్రాంతాలపై పడింది. దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇంట్లోని ఫర్నిచర్ కదిలినట్లు స్థానికులు చెప్పారు.

మరోవైపు పాకిస్థాన్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంప కేంద్ర హిందూకుశ్ ప్రాంతానికి 213 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలిలో ప్రకంపనలు సంభవించాయని ఓ అంతర్జాతీయ ఛానెల్ తెలిపింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో కూడా భూకంపం వచ్చినట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news