విద్వేషంతో నా తండ్రిని కోల్పోయా.. దేశాన్ని కోల్పోలేను : రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఓ భావోద్వేగపూరితమైన పోస్టు చేశారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన పోస్టును ట్విటర్‌లో చాలా మంది రీట్వీట్ చేశారు. ఇక లైకులు, షేర్లకైతే అంతే లేదు. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే..?

‘‘విద్వేష, విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. మనమంతా ఐక్యంగా ఉంటే దేన్నైనా అధిగమించొచ్చు’’ అని రాహుల్‌ ట్విటర్ వేదికగా పోస్టు చేశారు.

భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించారు. రాజీవ్‌ స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. తొలుత ఈ స్మారకం ప్రాంగణంలో మొక్కను నాటిన రాహుల్‌.. అనంతరం రాజీవ్‌ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ నేతలు డీకే శివకుమార్‌, కేఎస్‌ అళగిరి తదితరులు ఉన్నారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ తన తండ్రి స్మారకాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news