‘జనాభాలో భారత్‌ నం.1 ప్రభుత్వ వైఫల్యమే’.. కేంద్రంపై అఖిలేశ్ ఫైర్

-

ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిన విషం తెలిసిందే. దేశంలో అధిక జనాభా ప్రభుత్వ వైఫల్యమేనని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. ‘ఇది ఆందోళనకర వార్త. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం’ అని ట్వీట్‌ చేశారు.

‘పేదరికం, నిరుద్యోగం కారణంగా.. తమకు పనిలో సాయంగా ఉంటారని, లేదా సంపాదించి పెడతారని భావిస్తూ ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. వైద్యసదుపాయాల కొరత కారణంగా శిశుమరణాల భయం కూడా అధిక సంతానానికి దారితీస్తోంది. అంతేకాకుండా గర్భనిరోధక పద్ధతులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. సరైన చదువు లేకపోవడం వల్ల అధిక జనాభా అనర్థాలను అర్థం చేసుకోకపోవడం కూడా జనాభా పెరుగుదలకు మరో కారణం’ అని అఖిలేశ్‌ పేర్కొన్నారు.

2022 నాటికి భారత్‌ జనాభా 141.2 కోట్లు కాగా చైనా జనాభా 142.6 కోట్లుగా ఉండేది. అయితే, కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతోంది. భారత్‌లోనూ కొంత మేరకు క్షీణత కనిపిస్తోంది. అయితే చైనాతో పోలిస్తే తక్కువే. దీంతో మన దేశం అగ్రస్థానానికి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news