అమెజాన్‌ ఫ్రీడమ్‌ సేల్.. ఈ గ్యాడ్టెట్స్‌పై భారీ డిస్కౌంట్లు

-

వచ్చేది ఆగస్టు నెల. స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో అన్ని మార్కెట్‌ సంస్థలు ఫ్రీడమ్‌ సేల్‌ను స్టాట్‌ చేస్తున్నాయి. అమెజాన్‌లో గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ ప్రారంభంకానుంది. ఇందులో ఆఫర్లు, తేదీల వివరాలు చూద్దామా..!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు 5 రోజుల పాటు జరగనుంది. ఈ సేల్‌లో భారీగా ఆఫర్లను ప్రకటిస్తోందని తెలిసింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెజాన్.. ఈ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ని తెస్తోంది. సాధారణంగా ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో వస్తువుల ధరలు భారీగా పెంచేసి వాటిపై డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా క్రియేట్ చేస్తారు. మనకు కూడా ఆ విషయం బాగా తెలుసు.

అదే వస్తువు బయటి మార్కెట్లలో కూడా అదే ధరకు లభిస్తుంది. కానీ డిస్కౌంటుకి ఇస్తున్నట్లుగా ఈ-కామర్స్ సైట్లు చెప్పుకుంటాయి. ఇదో రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. అయితే అమెజాన్ డిస్కౌంటుతో పాట మరికొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా SBI క్రెడిట్‌ కార్డు వాడే వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్‌ ఇవ్వబోతోంది. ఈ-కామర్స్ కొనుగోలుదారుల్లో SBI క్రెడిట్ కార్డు వాడేవారి సంఖ్య చాలా తక్కువే ఉంటుందని తెలుస్తోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉంటే 12 గంటల ముందే..

అమెజాన్‌ ఈ సేల్‌లో ప్రైమ్‌ కస్టమర్లుకు 12 గంటలు ముందుగానే ఈ ఆఫర్లను పొందొచ్చని తెలిపింది. అందువల్ల ప్రైమ్ సభ్యత్వం ఉన్న వారు.. 12 గంటలు ముందే ఆఫర్‌ని పొందుతారు. ఫలితంగా ప్రైమ్ లేని వారికి ఈ ఆఫర్లు దక్కే అవకాశాలు తగ్గనున్నాయి.

ఈ గాడ్జెట్స్‌పై భారీ ఆఫర్స్‌

ఫ్రీడమ్‌ సేల్‌లో ఈసారి గాడ్జెట్స్‌కి భారీ ఎత్తున ఆఫర్లు ఇస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ మీ, వన్ ప్లస్, శాంసంగ్, రెడ్ మీ వంటి కంపెనీల ఫోన్లపై ఆఫర్లు ఉంటాయని తెలుస్తోంది. కొన్ని హ్యాండ్ సెట్లపై 40 శాతం దాకా డిస్కౌంట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా ఆఫర్లు ఇస్తున్న ఫోన్లలో చాలా వరకు 4Gవే ఉంటున్నాయి.

స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ వాచ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ ఇతరత్రా వాటిని కూడా ఈ సేల్‌లో డిస్కౌంటుకి అమ్మబోతున్నట్లు అమెజాన్ పేర్కొంది. అయితే జనరల్‌గా కూడా ఈ గాడ్జెట్స్‌పై ఎప్పుడూ డిస్కౌంట్లు ఉంటూనే ఉంటాయి. ప్రత్యేకంగా సేల్ సందర్భంగా మాత్రమే డిస్కౌంట్ ఇస్తారా అనేది తేలాల్సిన అంశం. ఎందుకంటే.. వేటిపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నదీ అమెజాన్ పూర్తిగా చెప్పలేదు. అలా చెప్పి ఉంటే.. ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఉంది? సేల్ ప్రారంభమయ్యాక ఎంత డిస్కౌంట్ ఉంది? డిస్కౌంట్లలో తేడా ఏమైనా ఉందా అనేది తెలుసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news