భారతీయ విద్యార్థులకు గుడ్​న్యూస్ చెప్పిన అమెరికా

-

భారతీయ విద్యార్థులకు అమెరికా గుడ్​న్యూస్ చెప్పింది. వర్క్‌ పర్మిట్ల (ఓపీటీ) విషయంలో కొన్ని రంగాల్లో పని చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రీమియం ప్రొసెసింగ్‌ను వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ద్వారా సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితంలలో (స్టెమ్‌) ప్రీమియం ప్రొసెసింగ్‌ను వర్తింపజేస్తారు. దీనివల్ల భారతీయ విద్యార్థులకు అత్యధిక ప్రయోజనం కలగనుంది. ఈ విధానం ఈ నెల 6వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు అమెరికా వలస సేవల విభాగం వెల్లడించింది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అదనంగా ఈ ప్రీమియం ప్రొసెసింగ్‌ ఎఫ్‌-1 వీసాదారులకు ఎంతో మేలు చేస్తుందని వలస సేవల విభాగం డైరెక్టరు ఎం.జడ్డో పేర్కొన్నారు. ఐ-907 ఫారం ద్వారా కొత్త ఆన్‌లైన్‌ విధానంలో ప్రీమియం ప్రొసెసింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఇది భారతీయ విద్యార్థులకు గొప్ప వార్త అని కమ్యూనిటీ లీడర్‌ అజయ్‌ భూటోపియా తెలిపారు. ఓపీటీ అనుమతుల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వారికిది ఎంతో మేలు చేయనుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news