చట్టాన్ని తన పని చేయనివ్వండి.. రైజ్లర్లతో భేటీలో అమిత్ షా

-

రెజ్లర్ల ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా రెజ్లర్లతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ అయినట్లు తెలిసింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సమావేశ వివరాలు తాజాగా బయటకొచ్చాయి.

శనివారం రాత్రి 11 గంటలకు కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో రెజ్లర్లు బజ్‌రంగ్‌ పునియా, సాక్షి మలిక్‌, సంగీతా ఫొగాట్‌, సత్యవర్త్‌ కడియన్‌ తదితరులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. బ్రిజ్‌భూషణ్‌ మీద వచ్చిన ఆరోపణలపై పారదర్శక దర్యాప్తు జరిపించాలని, వేగంగా చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు కేంద్రమంత్రిని కోరారు. అయితే ‘‘చట్టం అందరికీ సమానమే.. చట్టాన్ని తన పని తాను చేయనివ్వండి’’ అని అమిత్ షా రెజ్లర్లకు చెప్పినట్లు సమాచారం. తాము కేంద్రమంత్రితో భేటీ అయినట్లు బజ్‌రంగ్‌ పునియా మీడియా వద్ద ధ్రువీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version