కేరళ బాంబు పేలుళ్ల ఘటనపై అమిత్ షా ఆరా

-

కేరళలోని కొచ్చిలో ఇవాళ జరిగిన వరుస పేలుళ్ళు ఘటనలో ఒకరు మరణించారు. మరికొంతమందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో క్రైస్తవుల ప్రార్థనల సందర్భంగా ఈ ఉదయం 9:40 గంటలకు ఈ ఘటన జరిగింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ATS టీం ఘటనాస్థలానికి చేరుకుంది.

జమ్ర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో వేదిక కుడివైపున ఈ పేలుడు సంభవించింది. అయితే, కేరళలోని కొచ్చిలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఆ రాష్ట్ర సీఎం పీనరయి విజయన్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అమిత్ షా ఆదేశాలతో NIA, NSG బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించాయి. ఇవి చాలా దురదృష్టకర సంఘటన అని, దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నామని సీఎం విజయన్ తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 23 మందికి గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news