గెహ్లాట్ ను కాదని సచిన్ పైలట్ కు అవకాశం రాదు – అమిత్ షా

-

రాజస్థాన్ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలపై అమిత్ షా స్పందించారు. గెహ్లాట్ ను కాదని సచిన్ పైలట్ కు అవకాశం రాదని… ముఖ్యమంత్రి గా అశోక్ గెహ్లాట్ కే ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కి సచిన్ పైలట్ ఇచ్చే డబ్బుకంటే, సి.ఎమ్ గెహ్లాట్ ద్వారా అందే అవినీతి సొమ్మే ఎక్కువ అని.. రాజస్థాన్ ను “అవినీతి అడ్డా” గా మార్చి, రాష్ట్రాన్ని సి.ఎమ్ గెహ్లాట్ దోచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు.

అలా దోచుకున్న అవినీతి సొమ్మునే కాంగ్రెస్ పార్టీకి గెహ్లాట్ ఇస్తున్నారని.. రాజస్థాన్ చరిత్రలో గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం అని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించి రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాజస్థాన్ లోని 25 లోకసభ స్థానాల్లో కూడా బిజేపి విజయం సాధిస్తుంది…మత కలహాలు, మహిళల పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించడం, దళితులపై అత్యాచారాలతో రాజస్థాన్ లో ప్రభుత్వం నడుస్తోందని.. తదుపరి ఎన్నికల్లో బిజేపిదే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Latest news