భారత్‌ భూ – భాగాన్ని చైనా ఆక్రమించింది – అమిత్‌ షా

భారత్‌ భూ – భాగాన్ని చైనా ఆక్రమించిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. 1962 లో చైనా అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇవాళ పార్లమెంట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీజీ పాలనలో ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించలేకపోయిందని వెల్లడించారు.

చైనా రాయ బారుల నుంచి కాంగ్రెస్‌ నేతలు డబ్బులు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు అమిత్‌ షా. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ లో ఆ డబ్బులను ఖర్చు చేశారని ఫైర్‌ అయ్యారు. మన భారత భూ బాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించారని.. కానీ వారిని చాలా బాగా మన సైనికులు అడ్డుకున్నారని స్పష్టం చేశారు అమిత్‌ షా.