దేశంలో భూకంపాలు ఎక్కువయ్యాయి..లడ్డాఖ్‌లో రోజు భారీ భూకంపం సంభవించింది..తెల్లవారు జామున 4.44గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది..
కార్గిల్ కు ఉత్తరాన 433 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది..లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో భూమి కంపించిందని సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు చెప్పారు..ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.వరుస భూమి కంపించడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.