దుబాయ్ లో అనంత్-రాధికా షాపింగ్.. రూ.25 కోట్ల విలువైన కార్లతో కాన్వాయ్‌ వీడియో వైరల్

-

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటీవలే అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. ఈ క్రమంలో వారు పెళ్లి షాపింగ్ పనుల్లో బిజీ అయ్యారు. అయితే తాజాగా ఈ జంట దుబాయ్లో షాపింగ్ చేస్తూ కనిపించింది. ఈ క్రమంలో వారి విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌కు చెందిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

దుబాయ్‌లో ఫుల్ సెక్యూరిటీ కవర్‌లో మాల్‌కు వచ్చి షాపింగ్ చేసింది ఈ జంట. ఆ లగేజీ తెచ్చుకోవడానికి వారు సుమారు రూ.25 కోట్ల విలువైన కార్ల కాన్వాయ్‌ను వినియోగించారు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వాహన శ్రేణిలో రోల్స్‌రాయిస్‌ కలినాన్‌ బ్లాక్ బ్యాడ్జ్‌తో పాటు పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే అత్యవసర వైద్య సదుపాయం కోసం ఆ వాహనాల వరుసలో ఒక అంబులెన్స్ కూడా ఉంచడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news