మ‌రో 8 ఓమిక్రాన్ కేసులు.. మొత్తం 109

ఓమిక్రాన్ పంజా దేశం పై విసురుతుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తుంది. తాజా గా ఈ రోజు సాయంత్రం మ‌రో 8 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ 8 కేసులు కూడా మ‌హారాష్ట్ర నుంచే న‌మోదు అయ్యాయి. కాగ మ‌హారాష్ట్ర లో ఓమిక్రాన్ వేరియంట్ వేగం గా విస్త‌రిస్తుంది. నేడు నమోదు అయిన కేసు ల‌తో మొత్తం 40 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి.

అంతే కాకుండా దేశ వ్యాప్తం గా అధికారికా లెక్క‌ల ప్ర‌కారం మొత్తం 109 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశం లోని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఓమిక్రాన్ వేరియంట్ పై అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. ప్ర‌జ‌లు ఓమిక్రాన్ వేరియంట్ ప‌ట్ల జాగ్ర‌త్త గా ఉండాల‌ని హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు. తెలంగాణ లో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు 8 వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రం లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు.