బంగారం కొంటున్నారా…? ట్యాక్స్ ఎంత పడుతుందంటే..?

-

చాలా మంది బంగారాన్ని కొనడానికి ఇష్టపడతారు. బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ గా భావిస్తారు. కొందరు అయితే నాణేల రూపం లో కొనడానికి ఇష్టపడతారు. లేదా డిజిటల్ ఫామ్‌లో అయితే మొబైల్ వాలెట్స్ ద్వారా కొనొచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్, సవరిన్ గోల్డ్ బాండ్ వంటి వాటి రూపంలో కూడా కొనచ్చు.

ఇది ఇలా ఉంటే బంగారాన్ని కొంటె పన్ను అంశాలను గుర్తించుకోవాలి. అయితే బంగారంపై ఏ ఏ సమయాల్లో ఎలాంటి పన్నులు పడతాయో చూద్దాం. ఫిజికల్ గోల్డ్ అయితే క్యాపిటల్ అసెట్‌ లోకి వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించుకోవాలి. దీనిని కొన్న దగ్గరి నుంచి 36 నెలలలోపు దాన్ని విక్రయిస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది పడుతుంది.

అదే 36 నెలల తర్వాత అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది. ఇది 20 శాతం ఉంటుంది. అదే ఒకవేళ డిజిటల్ గోల్డ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు వంటి వాటిల్లో డబ్బులు పెట్టారంటే
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. మూడేళ్లలకు లోపు అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, 3 ఏళ్లు దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తుంది.

అయితే వీటికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. అయితే దీని కోసం మెచ్యూరిటీ వరకు బాండ్లను కొనసాగించాలి. 3 ఏళ్లలోపు విక్రయిస్తే మాత్రం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, 3 ఏళ్ల తర్వాత అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అవుతుంది. ఈ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news