ఇదేం లీవ్ లెటర్ మావా… పుష్ప సినిమా కోసం ప్రిన్సిపాల్ కు క్రేజీ ఆఫర్ తో లీవ్ లెటర్ రాసిన స్టూడెంట్స్

 పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ గా ఎర్ర చందనం స్మగ్లర్ గా నటించడంతో అభిమానుల అంచనాను పెంచాయి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ పుష్ప సినిమా కోసం లీవ్ లెటర్ రాయడం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఏపీలో ఓ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ పుష్ప సినిమా కోసం సెలవు కోరుతూ.. ప్రిన్సిపాల్ కు లీవ్ లెటర్ రాశారు. దీంతో పాటు ప్రిన్సిపాల్ కు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. కావాలంటే మీరు సినిమాకు రావచ్చని ఓ టికెట్ ఎక్స్ ట్రా టికెట్ ఉందని సెలవిచ్చారు స్టూడెంట్స్. క్రేజీగా రాసిన ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇటీవల 17న శుక్రవారం పుష్ప సినిమా రిలీజ్ అయింది. అయితే ముందు రోజు స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ కు లేఖ రాశారు. సినిమా విడుదల రోజు కాలేజీకి సెలవు ప్రకటించాలని కోరారు. సెలవు ఇవ్వకున్నా.. తాము కాలేజీకి వచ్చేది లేదని.. మా ఇళ్లకు మెసేజ్ లు, కాల్స్ చేయోద్దని లీవ్ లెటర్ లో రాశారు. చివర్లో సినిమా డైలాగ్ ’తగ్గేదే లే..‘ అంటూ రాసుకొచ్చారు స్టూడెంట్స్. ఇంతటితో ఆగకుండా.. తమ దగ్గర ఓ ఎక్ట్రా టికెట్ ఉందని కావాలంటే మీరు కూడా సినిమాకు రావచ్చని కోరారు. ఈ క్రేజీ లీవ్ లెటర్ వైరల్ గా మారింది.