ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మరికొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారట. అలాగే కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
NCP MP ప్రపూల్ పటేల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడనవీస్ లను కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ నేడు పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్టుకు రూ. 12, 911.15 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర కేబినెట్ కు పంపాల్సిన ప్రతిపాదనను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై కూడా సమీక్షించనున్నారు. ఇప్పటికే నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకారం తెలుపగా, కేంద్ర కేబినెట్ ఆమోదించగానే నిధులను విడుదల చేయనున్నారు.