అందమైన బెంగుళూరు కి మరెంత అందం..!

-

అందమైన ప్రకృతిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాసేపు సరదాగా ఆ ప్రకృతి మధ్య ఉంటే ఆ ఆనందానికి అవధులే ఉండవు. బెంగళూరు సిటీ పింక్ కలర్ లో ఎంతో అందంగా కనపడుతోంది. బెంగళూరులో ఎన్నో పింక్ ట్రంపెట్స్ చెట్లు ఉన్నాయి ఎంతో అందంగా పూలు పూస్తున్నాయి. నెటిజన్లు ఆ పూల అందాలని ఫోన్ లో చిత్రీకరిస్తున్నారు.

చాలా ఫోటోలు ఇప్పటికే ఆన్లైన్ లో షేర్ చేయడం జరిగింది. పింక్ ట్రంపెట్స్ ని టబెబుయా రోసియా లేదా పింక్ పౌయి అని కూడా అంటారు. ఒక రకమైన నియోట్రోపికల్ చెట్టు ఇది. దక్షిణ మెక్సికో కి సంబందించినవి ఇవి. పొడి వాతావరణంలో ఇవి ఎక్కువగా కనపడతాయి. జనవరి మరియు ఫిబ్రవరిలో ఈ చెట్లకి పూలు పూస్తాయి.

అలానే ఆగస్ట్, సెప్టెంబర్, ఏప్రిల్ మరియు మే నెల లో కూడా ఈ చెట్ల కి పూలు పూస్తాయి. బెంగుళూరు లో ఈ చెట్లని చూసి ట్విట్టర్ లో చాలా మంది షేర్ చేసారు. నాకు తెలిసినంతవరకు దేశంలోనే బెంగుళూరులో అత్యధిక టబెబుయా రోజా చెట్లు వున్నాయి అని రవి కీర్తి గౌడ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసారు. ఇంకో యూజర్ అయితే ఉగాది ఇక్కడ వుంది అని ఈ చెట్ల పూలని షేర్ చేసారు. ఆకాశం, ఈ చెట్టు పూలు పడేలా ఫోటోలు తీసి ఇంకో యూజర్ షేర్ చేసారు. ఇలా ఎంతో అందమైన ఫొటోస్ ని షేర్ చేసారు నెటిజన్లు.

 

Read more RELATED
Recommended to you

Latest news