ప్రైమరీ టీచర్లకు షాక్.. 36 వేల మంది ఉద్యోగాలు రద్దు చేసిన బెంగాల్ హైకోర్టు

-

పశ్చిమ బెంగాల్ లో టీచర్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏకంగా ఒకేసారి 36వేల మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలను కోల్ కతా హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉద్యోగుల అపాయింట్‌మెంట్ ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అపాయింట్‌మెంట్ ప్ర‌క్రియ‌లో స‌రైన విధానాల‌ను పాటించ‌లేద‌ని చెప్పింది.

జ‌స్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రైమ‌రీ టీచ‌ర్ల రిక్రూట్మెంట్‌లో జ‌రిగిన అవినీతి బెంగాల్ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 2016లో జ‌రిగిన‌ రిక్రూట్మెంట్ స‌మ‌యంలో ఎంపికైన 36 వేల మంది అభ్య‌ర్థులు స‌రైన రీతిలో శిక్ష‌ణ పొంద‌లేద‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది.

ఈ కేసులో 17 పేజీల తీర్పును జ‌స్టిస్ గంగోపాధ్యాయ వెలువ‌రించారు. శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల‌కు ఈ తీర్పును హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అభ్య‌ర్థులు విఫ‌ల‌మైన‌ట్లు కోర్టు తెలిపింది. 2014లోని టీచ‌ర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్ర‌కారం శిక్ష‌ణ జ‌ర‌గ‌లేద‌ని, అందుకే అపాయింట్‌మెంట్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news