మహిళల ముందు అసభ్య ప్రవర్తన.. రహస్య భాగాలపై పెట్రోల్ పోసి..

-

మధ్యప్రదేశ్ బేతుల్​లో దారుణం జరిగింది. మహిళలు, బాలికల ముందు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఇద్దరు వ్యక్తులు. నిందితులను బిజాదేహి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతుల్ జిల్లా బిజాదేహి పోలీస్ స్టేషన్​ పరిధిలోని కాజలీ గ్రామానికి చెందిన మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి మహిళల ముందు నగ్నంగా అసభ్యకర చర్యలకు దిగేవాడు. రహస్య భాగాలను చూపించేవాడు. దీంతో విసిగిపోయిన ఇద్దరు వ్యక్తులు.. బాధితుడి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత బాధితుడిని చిచోలిలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని సమాచారం.

“బాలికలు, మహిళల ముందు నగ్నంగా అసభ్యకర చర్యలకు పాల్పడేవాడు బాధితుడు. పలుమార్లు గ్రామస్థులు హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. అందుకే గ్రామస్థులు అతడిపై కోపంగా ఉండేవారు. శనివారం అతడి ప్రైవేట్ శరీర భాగాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఇద్దరు నిందితులు. సుదేశ్ కవ్డే, కృష్ణ ఉయికే అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.” అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news