ఇండియా కరోనా వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన…!

మన దేశ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. రెగ్యులేటరీ అధికారుల నుండి అనుమతి పొందితే మాత్రం ఈ టీకాను 2021 రెండవ త్రైమాసికంలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ రాయిటర్స్‌ కు తెలిపారు. ఇక ఎయిమ్స్ ఢిల్లీ కోవాక్సిన్ యొక్క మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌ పై ఎథిక్స్ కమిటీకి ప్రతిపాదనను సమర్పించే అవకాశం ఉంది.

కోవాక్సిన్ కోసం చివరి దశ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ప్రాధమిక అనుమతి పొందిన భారత్ బయోటెక్, నవంబర్ లో మూడవ దశ ట్రయల్స్ కోసం నియామకాలు చేపడుతుంది. ఈ ట్రయల్స్ ని 10-12 రాష్ట్రాల్లోని 25 సైట్లలో నిర్వహిస్తామని ప్రకటన చేసింది. ఒక్కొక్కరికి రెండు మోతాదులు ఇస్తామని చెప్పింది.