అతి చిన్న దేశం కూడా భారత్ కు సహాయం చేస్తుందిగా…?

-

భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆక్సీజన్ కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని నుంచి బయటకు రావడానికి భారత్ కు పలు దేశాలు అండగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో మన సరిహద్దుల్లో ఉండే చిన్న దేశం భూటాన్ అస్సాంకు 40 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. క్రయోజెనిక్ ట్యాంకర్లను ఉపయోగించి ఆక్సిజన్ ఎగుమతి చేస్తుంది.

తూర్పు భూటాన్ లోని సామ్‌డ్రప్ జోంగ్ఖర్ జిల్లాలోని మోటంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని కొత్త ప్లాంట్ నుండి ఈ ఆక్సీజన్ ను పంపిస్తున్నారు. భూటాన్ కంపెనీ ఎస్‌డి క్రయోజెనిక్స్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటులో భూటాన్ 51% పెట్టుబడి పెట్టగా అస్సాంకు చెందిన భారతీయ కంపెనీ మేఘాలయ ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ 49% పెట్టుబడి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news