జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్ఞానవాపీ మసీదు కేసులో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలంటూ హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్ పై వారణాసిలోని పాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది. ఇందుకు సంబంధించిన న్యాయమూర్తి నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హాజరు కానందువల్ల తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

తక్షణమే స్వయంభు జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వరకు పూజలు చేసుకునేందుకు అనుమతి, జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్ ను హిందువులకు అప్పగించడం, మసీదులోకి ముస్లింలను ప్రవేశించకుండా నిషేధించడం వంటి మూడు డిమాండ్లపై నవంబర్ 14వ తేదీన నిర్ణయం తీసుకోనుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. అక్టోబర్ లో జరిగిన మునుపటి విచారణలో..  ‘శివలింగం’పై శాస్త్రీయ అధ్యయనానికి అక్టోబరు నాటి విచారణలో న్యాయస్థానం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. వీడియో సర్వే సమయంలో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేలా ఆదేశాలు వెలువరించాలని హిందూ పక్షాలు సెప్టెంబరు 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

అయితే, ఇది శివలింగం కాదని, ఫౌంటెయిన్ అని ముస్లింలు వాదిస్తున్నారు. కార్బన్ డేటింగ్‌కు వారణాసి కోర్టు నిరాకరించడాన్ని హిందూ పక్షాలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్నాయి. ‘భారత పురావస్తు శాఖ (ASI) సర్వేకు ఆదేశించడం సరైంది కాదు.. అటువంటి ఉత్తర్వు ఇవ్వడం ద్వారా శివలింగం వయస్సు, స్వభావం, నిర్మాణం గురించి తెలుసుకోవచ్చు.. కానీ ఇది కూడా సాధ్యమయ్యే అవకాశాన్ని సూచించదు. న్యాయమైన పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది’ అని వారణాసి కోర్టు అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Latest news