కుమురంభీం ఆసిఫాబాద్ కౌటాల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌కు చెందిన గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రజనీ కుమార్ తీవ్రంగా గాయపడగా తోటి సిబ్బంది అతణ్ని కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రజనీ కుమార్ మృతి చెందాడు.
ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ రజనీకుమార్ కుమార్ గొంతులోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత అతణ్ని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రజనీ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. రజనీ కుమార్ మంచిర్యాల గుడిపేటకు చెందిన బెటాలియన్ కానిస్టేబుల్. అతని స్వస్థలం బెల్లంపల్లి మండలం బట్టుపల్లి గ్రామం. సెంట్రీ డ్యూటీలో ఉన్న సమయంలో వేకువ జామున ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఘటనపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.