వచ్చే లోక్ సభ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ చూస్తుంది. రాబోయే ఎన్నికలలో 50 శాతం ఓట్లు రావాలనే ఉద్దేశంతో ఉంది. ఇప్పటికే పార్టీ నాయకులకి కార్యకర్తలకి సూచనలు అందజేసింది. వచ్చే జనవరి 22వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవము జరగనుంది. మోడీ హయాంలో ఎప్పటి నుండో ఉన్న ఈ కల సాకారం కాబోతుంది. కావున దీనిని బిజెపి సద్వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
పార్టీ ఆఫీస్ బేరర్లతో జరిగిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను గురించి చర్చించారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ,హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు హాజరై పార్టీ శ్రేణులకు బలమైన సందేశాన్ని ఇచ్చారు.
బీజేపీ రామ మందిర ప్రతిష్టాపన వేడుకలని విజయానికి మూలస్తంభంగా మార్చుకావాలని భావిస్తుంది. ఈ వేడుకలను ఎన్నికల ప్రచారం అంశంలో వాడుకొని ఓట్లు రాబట్టేందుకు వ్యూహాలను అమలు చేయలని ప్రయత్నిస్తుంది. ఆలయ నిర్మాణం,రామ మందిర ఉద్యమంలో బీజేపీ చేసిన కృషిని బుక్లెట్ గా విడుదల చేయనున్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో ఆలయ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నించాయనే విషయాన్ని భాజపా అందరికీ తెలిసేలా స్పష్టం చేయనుంది.