పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ అని నాకు తెలియదు -శ్రీయ రెడ్డి

-

శ్రీయ రెడ్డి…. ఈ భామ హీరో విశాల్ నటించిన పొగరు సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కినటువంటి సలార్ సినిమాలో పోషించిన రాధా రమ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కి సోదరిగా నటించి అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలో….. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా శ్రీయ రెడ్డి సలార్ చిత్రంతోపాటు తన నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దాదాపు దశాబ్దం కాలం తర్వాత నటించిన ఈ సినిమా నాకెంతో గుర్తింపును సంపాదించి పెట్టిందని పేర్కొంది.

శ్రీయా రెడ్డి తన తదుపరి చిత్రమైన ఓజీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమాలో తన పాత్ర ఎంతో కీలక కానుందని తెలిపింది. ఓజి చిత్రాన్ని దర్శకుడు సుజిత్ డిఫరెంట్ కథతో తెరకెక్కిస్తున్నాడు అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గురించి ఇంతకుముందు తను ఎప్పుడు అంతగా వినలేదని…. ఆయన అంత పెద్ద స్టార్ అని తనకి తెలియదని చెప్పింది. ఈ చిత్రంలో నటిస్తున్నానని తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను ఎంతో మర్యాదగా చూస్తున్నారని చెప్పింది. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. పవన్ చాలా మంచి మనిషి. తను ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతాడు. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నెగటివ్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నప్పటికీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. ఓజి సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని దీనిని ప్రేక్షకులతో కలిసి చూడాలని ఉందని చెప్పుకోచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news