‘రూ.450కే గ్యాస్ సిలిండర్.. నెలకు రూ.1250 భృతి’.. ఆ రాష్ట్రంలో బీజేపీ సీఎం వరాల జల్లు

-

మరికొద్ది రోజుల్లో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే నోటిఫికేషన్ రాకపోయినా.. ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ప్రజలను ఇప్పటి నుంచే ఆకర్షించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో బీజేపీ తన గద్దెను సంరక్షించుకోవాలని.. మళ్లీ అధికారం చేజిక్కుంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలపై వరాల జల్లు కురిపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.

పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మహిళలకు లాడ్లీ బెహ్నా పథకం కింద ఇచ్చే వెయ్యి రూపాయల భృతిని రూ.1,250కి పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని..శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు నెలలో రాష్ట్రంలోని మహిళలు రూ. 450కే గ్యాస్ సిలిండర్ను ఇస్తామన్నారు. ఆ తర్వాత దీనిపై పూర్తి స్థాయి వ్యవస్థను తీసుకువచ్చి తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మొదట రూ.250 మహిళల ఖాతాల్లో వేస్తామని.. ఆ తర్వాత మిగిలిన రూ.1,000ను సెప్టెంబర్లో జమ చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news