ప‌వ‌న్‌కు బీజేపీ నుంచి గ‌ట్టి వార్నింగ్ ..? ఇలా అయితే క‌ష్ట‌మే..!

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారా? కీల‌క‌మైన ఓ విష‌యంలో ఆయ‌న సొద‌రు డు, జ‌న‌సేన వ్య‌వ‌హారాల నేత నాగ‌బాబు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నా యి. ఇది జ‌న‌సేన అధినేత ప‌రువును తీస్తాయ‌ని అంటున్నారు. ‘‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా.. కదా? అనేది చర్చించదగిన విషయం. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే.. ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.

కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సంద ర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే… మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. నిజానికి ఇది సిద్ధాంతాల ప్రాతిప‌దిక‌గా తాము ఎదుగుతున్నామ‌ని చెప్పుకొనే ప‌వ‌న్‌కు తీవ్ర విఘాతం క‌లిగించే విష‌యం. పైగా గాంధీని త‌మ వాడిగా ఓన్ చేసుకున్న బీజేపీ తో ప‌వ‌న్ పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ స‌మ‌యంలో బీజేపీ నియ‌మాల‌కు విరుద్ధంగా త‌న పార్టీకే చెందిన నాగ‌బాబు ఇలా నోరు జార‌డ‌డంపై బీజేపీ కేంద్ర పెద్ద‌లు కూడా ప‌రిశీలిస్తున్నార‌ని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, ఇటు ఏపీలోకానీ, అటు తెలంగాణ‌లో కానీ, ఎవ‌రూ దీనిపై కామెంట్లు చేయ‌లేదు. కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, మున్ముందు ప‌వ‌న్ రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. భ‌విష్య‌త్తులో ఎవ‌రినైనా విమ‌ర్శిస్తే.. నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌ను తెర‌మీదికి తెచ్చి ప‌వ‌న్‌ను రోడ్డు ఈడ్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక‌, గ‌తంలోనూ నాగ‌బాబు వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించాయి.

ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయి అంశాన్నే నెత్తిన‌వేసుకుని వివాదాస్ప‌దం చేయ‌డం, త‌న‌ను తాను తిట్టించుకుని, పార్టీ పరువును బ‌జారున ప‌డేస్తున్నార‌నే వాద‌న వ‌స్తోంది. మొత్తానికి ఈ విష‌యంలో బీజేపీ ప‌వ‌న్‌కు ఖ‌చ్చితంగా త‌లంటుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news