Bomb threats to many schools in national capital Delhi: ఢిల్లీ ప్రజలకు అలర్ట్..పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయట. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మెయిల్ ద్వారా స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయని అధికారులు గుర్తించారు.
ఢిల్లీ ఆర్కేపురం లోని రెండు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయట. ఇక ఈ సమాచారం రాగానే.. వెంటనే స్కూల్ కు చేరుకున్నారు బాంబ్ స్క్వాడ్, పోలీసులు. స్కూళ్ళలో తనిఖీలు చేస్తోన్నాయి బాంబ్ స్క్వాడ్. అయితే…. దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు రావడంతో.. హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. అన్ని చోట్లా తనిఖీలు చేస్తున్నారు. అన్ని చోట్లా కూడా ఆరా తీస్తున్నారు.