బ్రేకింగ్: కరోనా దెబ్బకు జేఈఈని కూడా లైట్ తీసుకున్నారు

-

తెలంగాణలో 27 సెంటర్లలో జె ఈ ఈ మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో జరగనున్నాయి జేఈఈ మెయిన్స్ పరీక్షలు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు 12 విడతలుగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. 67 వేల పైగా విద్యార్థులు ఈసారి తెలంగాణలో జేఈఈ పరీక్షలు రాస్తున్నారని అధికారులు వివరించారు. పోయిన సంవత్సరం లక్షకు పైగా విద్యార్థులు జేఈఈ రాశారు.JEE Main exams to begin from September 1; Know the important details here |  India News | Zee News

కరోనా నేపథ్యంలో జేఈఈ పరీక్ష రాస్తున్న వారి సంఖ్య భారీగా తగ్గింది. ఈసారి జేఈఈ పరీక్షలో కరోనా సెల్ఫ్ డిక్లరేషన్ ప్రవేశపెట్టింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్షా కేంద్రంలో మాస్కులు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రోవైడ్ చేస్తుంది. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాన్ని 50 శాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అంటే ప్రతి సిస్టమ్ కు మధ్యలో ఒక సిస్టం గ్యాప్ ఉంచుతున్నారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news