‘వన్ నేషన్ వన్ రేషన్’ పథకంలో మరో రెండు కొత్త రాష్ట్రాలు చేరాయి. కేంద్రపాలిత ప్రాంతాలు అయిన లక్షద్వీప్, లడఖ్ లు ఇవాళ్టి నుండి దీనిలో భాగమయ్యాయి. దేశంలో మొత్తం 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రేషన్ కార్డ్ పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ 26 రాష్ట్రాల్లో బయట నివసిస్తున్న ప్రజలు ఈ పథకం ద్వారా తమ రేషన్ పొందగలుగుతారు. ఈ పథకం ద్వారా మీరు ఎక్కడ నివసిస్తున్నా రేషన్ పొందే సౌకర్యం ఉంటుంది.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పి) మాదిరిగానే, ఇప్పుడు రేషన్ కార్డును కూడా పోర్ట్ చేసుకోవచ్చు. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు ద్వారా ప్రయోజనం కలుగుతుంది.